నగరంపై ‘నిఘా’ నేత్రం..

28 Jun, 2014 23:09 IST|Sakshi
నగరంపై ‘నిఘా’ నేత్రం..

సాక్షి, ముంబై: నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తిరిగి టెండర్లను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మూడుసార్లు వాయి దా పడిన ఈ టెండర్ల ప్రక్రియను ఈసారి ఎలాగైనా పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న ట్లు తెలుస్తోంది. 26/11 ఉగ్రవాద చర్య తర్వాత ముంబై నగర భద్రతపై నీలినీడలు అలముకున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి ఉగ్రమూకలు దాడులు చేస్తాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా సుమారు 1,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఉగ్రవాద చర్యల నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇది జరిగి ఆరేళ్లు గడిచినా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటివరకు మూడుసార్లు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఏజెన్సీల నుంచి తగిన స్పందన లభించలేదు. దీంతో ఇప్పుడు తిరిగి టెండర్లను ఆహ్వానించేందుకు నిర్ణయించారు. అయి తే ఈసారి ఆహ్వానించే టెండర్లకు సంబంధించి నియమ, నిబంధనల్లో కొద్దిపాటి మార్పులను చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఇదివరకు ఆహ్వానించిన టెండర్లలో వాటిని ఏర్పాటుచేసే సంబంధిత కంపెనీకి ముందుగా రూ.20 శాతం నిధులు చెల్లిస్తామని, మిగిలిన 80 శాతం నిధులు పనులు పూర్తయిన తర్వాత విడతల వారీగా ఐదేళ్లలో చెల్లించనున్నట్లు పేర్కొంది.
 
దీంతో టెండర్లు వేసేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. ఇలా మూడుసార్లు టెండర్లను ఆహ్వానించినప్పటికీ అందులో పొందుపర్చిన నిబంధనలవల్ల ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో తేరుకున్న ప్రభుత్వం నియమ, నిబంధనాల్లో స్వల్ప మార్పు లు చేసింది. ఎంతమేర పనులు పూర్తయ్యాయో అందులో 80 శాతం నిధులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా నిధులను విడతల వారీగా అందజేస్తామని స్పష్టం చేసింది. అంతేగాక రెండు కంపెనీలు (జాయింట్  వెంచర్) సంయుక్తంగా టెం డర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు మంజూ రునిచ్చిం ది.
 
వచ్చే శాసనసభ ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి రాకముందే ఈ పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్ తీస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జే.ఎస్.సహారియా స్పష్టం చేశారు. వచ్చే నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఈ-టెండర్లను ఆహ్వానించనుందని సహారి యా చెప్పారు. అందుకు అవసరమైన వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుందన్నారు. అయితే వాటి నియంత్రణ మాత్రం పోలీసు శాఖ వద్ద ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు