రైల్వే ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

20 Feb, 2018 01:02 IST|Sakshi

తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నపత్రం  

న్యూఢిల్లీ: బిహార్‌లో నిరసనల నేపథ్యంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రైల్వే బోర్డు రెండేళ్లు పెంచింది. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించేందుకు ఓకే చెప్పింది. అసిస్టెంట్‌ లోకో పైలట్, టెక్నీషియన్, ట్రాక్‌మెన్‌ తదితర కేటగిరీల్లో దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి రైల్వే ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చింది.

వీటికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితిని తొలుత రైల్వే బోర్డు జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లుగా (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంది) నిర్ణయించింది. ఆందోళనల నేపథ్యంలో అన్ని కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. 

మరిన్ని వార్తలు