60 ఏళ్ల నుంచే వృద్ధాప్య ప్రయోజనాలు: కేంద్రం

24 Apr, 2017 02:16 IST|Sakshi

న్యూఢిల్లీ: సీనియర్‌ సిటిజన్ల నిర్వచనానికి 60 ఏళ్ల వయసునే ఏకరూప ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలను కోరింది. వృద్ధులకు కల్పించే ప్రయోజనాల విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం–2007లో సవరణ చేయాలని కేంద్ర  సామాజిక న్యాయం, సాధికారత మంత్రి త్వ శాఖ యోచిస్తోంది. ఈ చట్టం ప్రకారం 60 ఏళ్లు లేదా ఆపైనున్న భారతీయులను సీనియర్‌ సిటిజన్లుగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ‘ఆపైన’ అనే పదం అర్థాన్ని మార్చి పలు సంస్థలు వారికి కల్పించాల్సిన సేవలను నిరాకరిస్తున్నాయని ప్రభుత్వ సీని యర్‌  అధికారి ఒకరు తెలిపారు.  రైళ్లలో మహిళలకు 58 ఏళ్లు లేదా ఆపైననున్న వారికి, పురుషులకు 60 ఏళ్లు లేదా ఆపైనున్న వారికి రాయితీ అమలుచేస్తున్నారు. ఎయిరిండియా ఇటీవలే ఈ వయసును 63 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించింది.

మరిన్ని వార్తలు