విరాళాల వెల్లడిపై పార్టీల మధ్య కుదరని అంగీకారం

18 Apr, 2015 02:26 IST|Sakshi

న్యూఢిల్లీ: విరాళాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలన్న న్యాయ కమిషన్ సిఫార్సులపై అంగీకారానికి రావడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. రూ.20వేల కంటే తక్కువ మొత్తంలో అందే విరాళాల మొత్తం రూ.20 కోట్లు దాటితే వాటి వివరాల పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలని న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనిపై పార్టీలమధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. విరాళాల వివరాలను సమర్పించని పార్టీలకు జరిమానాలు విధించడంపైనా అంగీకారం కుదరలేదు.

తప్పుడు సమాచారాన్ని ఇస్తే రూ.50 లక్షల జరిమానా విధించాలన్న ప్రతిపాదన పట్ల కూడా ఆయా పార్టీలు విముఖత వ్యక్తం చేసినట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి ఇది చిన్న పార్టీలకు మోయలేని భారమన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు పేర్కొన్నాయి. న్యాయ కమిషన్ సిఫారసు ఆచరణీయం కాదని రాజకీయ పార్టీలు పేర్కొన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం  ఎన్నికల సంస్కరణలకు సంబంధించి రూపొందించిన ముసాయి దా పత్రంలో తెలిపింది.
 
 

మరిన్ని వార్తలు