పోలీసులను హడలెత్తించిన మోడల్‌.. వీడియో వైరల్‌

29 Oct, 2018 15:39 IST|Sakshi
మోడల్‌ మేఘా శర్మ

ముంబై : ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన వివాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వివాదం ఈ నెల 25న జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. మేఘ శర్మ అనే మోడల్‌ ముంబైలోని లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెయింగ్‌ గెస్ట్‌గా ఉంటోంది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో పనిచేసే సెక్యూరిటి గార్డ్‌ని పిలిచి సిగరెట్‌ ప్యాకెట్‌ తెమ్మని కోరింది. అర్థరాత్రి సమయం కావడంతో సెక్యూరిటి గార్డ్‌ అందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన శర్మ ఆ సెక్యూరిటి గార్డ్‌పై దాడికి దిగింది. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసింది.

అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరిన పోలీసులు శర్మను తమతో పాటు పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి కంప్లైంట్‌ ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ శర్మ అందుకు నిరాకరించింది. ఇంత రాత్రి పూట.. అది కూడా ఒక్క మహిళా కానిస్టేబుల్‌ కూడా లేకుండా మీతో పాటు ఇప్పుడు స్టేషన్‌కి రాలేను. రేపు ఉదయం పోలీస్‌ స్టేషన్‌కి వస్తానని తెలిపింది. ఇప్పుడు తనను తన ప్లాట్‌కి వెళ్లానివ్వాల్సిందిగా కోరింది. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు.  దాంతో సహనం కోల్పొయిన శర్మ పోలీసులపై అరుస్తూ తన ఒంటి మీద దుస్తులను తొలగించింది. ఈ అనూహ్య చర్యకు జడిసిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.

అయితే అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ వివాదానికి సంబంధించిన వీడియోను స్వయంగా శర్మనే  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో పాటు ‘ఇది మన ముంబై పోలీసుల పని తీరు. రాత్రి ఏడు తర్వాత మహిళలను పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లకూడదు. కానీ ఈ పోలీసులు మాత్రం నన్ను తెల్లవారు జామున మూడు గంటలకు స్టేషన్‌ వచ్చి కంప్లైంట్‌ ఇవ్వమని ఆదేశించారు. వీరితో ఒక్క మహిళా కానిస్టేబుల్‌ కూడా లేదు’ అంటూ ట్వీట్‌ చేశారు.

అంతేకాక ‘పోలీసులు నాకు, సెక్యూరిటి గార్డ్‌కు మధ్య జరిగిన గొడవను చూస్తూ ఉన్నారు. కానీ అతని మీద ఎలాంటి చర్య తీసుకోక పోగా నన్ను నా ప్లాట్‌కి వెళ్లలనీవ్వకుండా అడ్డుకున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులను అక్కడి నుంచి పంపించడం కోసమే నేను నా దుస్తులను తొలగించాల్సి వచ్చింది’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ వివాదం జరిగిన సమయంలో శర్మ మద్యం సేవించి ఉందని అందుకే ఇంతలా రచ్చ చేసిందంటున్నారు స్థానికులు. ఈ విషయం గురించి పోలీసులు ‘శర్మనే మాకు ఫోన్‌ చేసింది. అందుకే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారులు వెళ్లారు. అవసరమైన సమయంలో మాత్రమే మహిళ కానిస్టేబుల్‌ని పంపిస్తాము’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు