‘జయపై మేం శ్వేతపత్రం విడుదల చేయం’

16 Dec, 2016 18:58 IST|Sakshi
‘జయపై మేం శ్వేతపత్రం విడుదల చేయం’

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వైద్యం నుంచి మృతి చెందిన వరకు జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏఐఏడీఎంకే నిరాకరించింది. డీఎంకే చేసిన డిమాండ్‌కు ససేమిరా అంది. జయ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆమెకు వైద్యం జరిపినప్పటి నుంచి చనిపోయేవరకు ఏమేం జరిగాయో వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డీఎంకే అధినేత కరుణానిథి తనయుడు ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేసిన విషయం విధితమే.

జయలలితపై ఆమె నిచ్చెలి శశికళ విష ప్రయోగం చేశారని, ఆమె ఆస్పత్రిలో ఉండగానే రాజకీయ వేదికకోసం ప్రయత్నాలు చేసి, అవి పూర్తయ్యాకే జయ మరణ వార్త అర్థరాత్రి ప్రకటించడమే కాకుండా అదే రాత్రి పన్నీర్‌ సెల్వంతో పదవీ ప్రమాణం చేయించారంటూ పలు కథనాలు రావడంతోపాటు పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో కొందరు ఇదే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్‌లు కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్‌ కూడా అదే డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు