తమిళనాడు అసెంబ్లీ పోరులో మజ్లిస్

4 Apr, 2016 18:36 IST|Sakshi

హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బోణీ కొట్టిన స్ఫూర్తితో మజ్లిస్ పార్టీ దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో బరిలోకి దిగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ నిర్ణయించింది. మూడు స్థానాలకు అభ్యర్థులను సోమవారం ఖరారు చేసింది.

గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బరిలో దింపిన ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకుంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. సీమాంచల్ ప్రాంతంలో కేవలం 6 స్థానాల్లో బరిలో దిగిన ఎంఐఎం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. కోచాదామన్ లో రెండో స్థానం, కిషన్ గంజ్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగితా చోట్ల కనీసస్థాయి ప్రభావం కూడా చూపలేకపోయింది.

మరిన్ని వార్తలు