తేజస్‌ విమానం నడిపిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

27 May, 2020 16:02 IST|Sakshi

సాక్షి, చెన్నై: భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్ భదౌరియా బుధవారం ఎంకే1 తేజస్‌ తేలికపాటి యుద్ధ విమానంలో విహరించారు. తమిళనాడులోని సూలూరు ఎయిర్‌స్టేషన్‌లో ఈ విమానాన్ని ఆయన పరిశీలించారు. ఇది నాలుగో తరం సూపర్‌సోనిక్‌ విమానాల్లో చిన్న ది, తెలికపాటిది. ఈ విమానాలను ఫ్లయింగ్‌ బుల్లెట్లుగా పిలుస్తారు. (హద్దు మీరుతున్న డ్రాగన్‌)

తేజస్‌ విమానాన్ని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్ భదౌరియా స్వయంగా నడిపారు. ఈ విమానాన్ని కోయంబత్తురు సమీపంలో ఉన్న సూలూరు 45వ స్కాడ్రన్‌ చేర్చారు. దీంతో సూలూరు ఎయిర్‌స్టేషన్‌ తేజస్‌ విమానాలను కలిగి ఉన్న రెండో ఐఏఎఫ్‌ స్కాడ్రన్‌గా నిలుస్తోంది. ఈ తేజస్‌ విమానం స్వదేశి పరిజ్ఞనంతో తయారు చేయబడింది. (మేకలు అమ్మి సొంతూరికి పయనం)

మరిన్ని వార్తలు