ప్రధాని మోడీ వద్దకు ఎయిర్ఫోర్స్ చీఫ్

2 Jun, 2014 15:49 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరూప్ రాహా సోమవారం నాడు కలిశారు. ప్రధానిగా ఎవరు కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా త్రివిధ దళాల అధినేతలు ఆయనను కలవడం సంప్రదాయం. అందులో భాగంగానే నరేంద్రమోడీ ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆయన వద్దకు వెళ్లారు. సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఈ సమావేశం జరిగింది.

భారత వైమానిక దళం ఎంత సన్నద్ధంగా ఉంటుందన్న విషయాన్ని ప్రధానమంత్రితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. తమకు ఏవేం అవసరాలున్నయన్న విషయాన్ని కొత్త ప్రధానికి వివరించేందుకు ముందుగానే వైమానిక దళం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకుని ఉంది. వివిధ రకాల యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కొత్తగా తీసుకోవాల్సి ఉండటం, ఇప్పటికి ఉన్నవి బాగా పాతబడిపోయి ఉండటంతో ఈ అవసరాలన్నింటినీ మోడీకి వివరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు