కార్లో డబ్బు.. అదుపులో ఎయిర్‌ఫోర్స్‌ అధికారి

5 Dec, 2016 16:58 IST|Sakshi
కార్లో డబ్బు.. అదుపులో ఎయిర్‌ఫోర్స్‌ అధికారి

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో పాత, కొత్త నోట్లను కలిగి ఉన్న భారత వైమానిక దళ అధికారి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రోహతక్‌ జిల్లా బహ్వక్బార్పూర్‌ గ్రామానికి చెందిన పరమ్‌ జీత్‌గా గుర్తించారు. ఢిల్లీ నుంచి రోహతక్‌ వచ్చిన ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి పరమ్‌ జీత్‌ను పోలీసులు మధ్యలో అడ్డగించారు. ఆయనను తనిఖీ చేయగా రూ.11.08లక్షల పాత, కొత్త డబ్బు లభించింది. తొలుత మాములుగానే ఆయనను తనిఖీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ తన వద్ద డబ్బు ఉందనే కంగారులో ఆర్యా నగర్‌ వద్ద ఏర్పాటు చేసిన నాకాబంది వద్ద తన కారును ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు.

దీంతో అతడిని వెంబడించిన పోలీసులు చివరకు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. అయితే, ఈ డబ్బు ఎక్కడిది అనే విషయంలో వివరణ ఇవ్వలేకపోయారు. ఈ డబ్బులో రూ.3లక్షలు కొత్తవి ఉండగా.. రూ.116లక్షలు పాత కరెన్సీ.. మిగితా మొత్తం కూడా రూ.50, రూ.20, రూ.10 నోట్లలో ఉన్నాయి. అయితే, ఈ నెలాఖరున తన భార్య పుట్టిన రోజు ఉందని, ఆమెకు బహుమతిగా కారును ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్డరిచ్చే క్రమంలో భాగంగా ఈ డబ్బు తీసుకెళుతున్నట్లు తెలిపాడు. అయితే, పోలీసులు మాత్రం ఈ డబ్బుకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే వదంతులతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు