మాంసాహారం సర్వ్‌ చేసినందుకు 47 వేలు ఫైన్‌

24 Sep, 2019 10:53 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఎయిరిండియాకు రూ.47 వేలు జరిమానా విధించింది. శాఖాహారులైన ప్రయాణికులకు మాంసాహార భోజనం వడ్డించినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. వివరాలు.. మొహాలి సెక్టార్‌ 121కి చెందిన చంద్రమోహన్‌ పఠాక్‌ భార్యతో కలిసి ఢిల్లీ నుంచి చికాగో వెళ్లేందుకు జూన్‌ 17, 2016లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అంతేకాక అదే ఏడాది నవంబర్‌ 14న  తిరుగు ప్రయాణం నిమిత్తం రిటర్న్‌ టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నాడు. తాను, తన భార్య శాఖాహారులమని టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలోనే స్పష్టం చేశాడు. చికాగో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపాడు చంద్రమోహన్‌. కానీ ఢిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విమాన సిబ్బంది తమకు మాంసాహారం భోజనం సర్వ్‌ చేశారని ఆరోపించారు. అంతేకాక ఆహార పొట్లాల మీద మాంసాహారం, శాఖాహారం అని తెలిపే గుర్తులు కూడా లేవన్నారు. దాంతో ఆగ్రహించిన చంద్రమోహన్‌ ఈ విషయం గురించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

ప్రయాణికుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను ఎయిరిండియా సంస్థ చంద్రమోహన్‌కు రూ. 10 వేలు జరిమానాతో పాటు లీగల్‌ ఖర్చుల నిమిత్తం మరో ఏడు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఎయిరిండియా కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఎయిరిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్‌ జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీని గురించి చంద్రమోహన్‌ పఠాక్‌ మాట్లాడుతూ.. ‘నేను ముందుగానే మేం శాఖాహారులమని స్పష్టంగా చెప్పాను. కానీ వారు నాకు మాంసాహార భోజనం అందించారు. వారు పాపం చేశారు. కోర్టు తగిన శిక్ష విధించింది’ అని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ నేతకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ

‘థరూర్‌ జీ.. ఇండియా గాంధీ ఎవరు?’

సైకిల్‌పై చెన్నై టు జర్మనీ

రైల్వే టికెట్‌ కౌంటర్‌లో చోరీ

సాహో సీఐ దిలీప్‌

ఏడాది గరిష్టానికి పెట్రోల్‌

ఎలక్షన్‌ కమిషనర్‌ భార్యకు ఐటీ నోటీసు

దూకుతా.. దూకుతా..

జైల్లో చిదంబరంతో సోనియా భేటీ

సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం

బాలాకోట్‌ ఉగ్రశిబిరం మొదలైంది

ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌.. అన్నిటికీ ఒకటే కార్డు

ఈనాటి ముఖ్యాంశాలు

కొండెక్కిన ఉల్లి.. సెంచరీకి చేరువగా పరుగులు

రాజధానిలో రెండు లక్షల సెన్సర్‌ లైట్లు

పార్టీ బలంగా ఉన్నంతకాలం..నేను కూడా

‘ప్లీజ్‌ నన్ను కాపాడండి’

రావీష్‌ కుమార్‌కు గౌరీ లంకేశ్‌ అవార్డు

ఆహార వ్యర్ధాల నుంచి ఇంధనం..

‘మీరు స్టార్‌ క్యాంపెయినర్‌ కాదు’

రెబల్‌ ఎమ్మెల్యేలకు రిలీఫ్‌

'దేశంలో మగ టీచర్లే అధికం'

47 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన సీఎం

‘చంద్రయాన్‌-2 వందకు వంద శాతం సక్సెస్‌’

ఇకపై వారికి నో టోఫెల్‌

కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

‘మల్టీపర్పస్‌ కార్డు సాధ్యమే’

‘నీ రాకతో అన్నీ మారిపోయాయి’

చిన్నమ్మ మరోసారి చక్రం తిప్పేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

వాల్మీకి.. టైటిల్‌లో ఏముంది?

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

నవ్వించి ఏడిపిస్తాం