లంచ్‌బాక్స్‌ కడగమనడంతో.. గంటసేపు ఆలస్యం

19 Jun, 2019 12:58 IST|Sakshi

 ఓ పైలట్ తన లంచ్‌బాక్స్‌ను కడగమని జూనియర్ సిబ్బందిని ఆదేశించడంతో  పైలట్- సిబ్బంది మధ్య తీవ్ర వాదనకు తెర లేపింది. దీంతో బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం ఏఐ772 సోమవారం గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ సంఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పైలట్ మరియు సిబ్బంది ప్రయాణికుల ముందే గోడవకు దిగారు. ఫలితంగా బెంగళూరు-కోల్‌కతా విమానం 77 నిమిషాలు ఆలస్యం అయింది.

 ఈ ఘటనపై వైమానిక సంస్థ వెంటనే చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఈ సంఘటనను 'ధృవీకరించి, ఈ విషయం దర్యాప్తులో ఉంది' అన్నారు. ‘కెప్టెన్లు తరచూ క్యాబిన్ సిబ్బందిని మెనియల్ ఉద్యోగాలు చేయమని నెట్టివేస్తారు. కెప్టెన్ మీ యజమాని అయినప్పుడు ఏమి చెప్పగలము. వారిపై ఫిర్యాదులు ఎటువంటి ప్రభావం చూపవు‘ అని క్యాబిన్ సిబ్బంది అన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా