వందే భారత్‌ మిషన్‌ : తగ్గిన విమాన చార్జీలు

20 Jul, 2020 10:50 IST|Sakshi

భారీ ఊరట

సాక్షి, న్యూఢిల్లీ : వందే భారత్ మిషన్‌ కింద అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. జులై 22 నుంచి ఆగస్ట్‌ 31 వరకూ అమెరికాకు 180 ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఆరు నగరాల నుంచి విమాన సర్వీసులు న్యూయార్క్‌, చికాగో, నెవార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్‌ డీసీలకు ప్రయాణీకులు ఈ విమానాల ద్వారా రాకపోకలు సాగించవచ్చు. భారత్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయాణీకులు స్టార్‌ అలయన్స్‌ భాగస్వాముల ద్వారా అక్కడ తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

కాగా వందేభారత్‌ మిషన్‌లో తొలి రెండు దశల్లో విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో మూడవ దశలో ఎయిర్‌ ఇండియా విమాన చార్జీలను గణనీయంగా తగ్గించింది. ఆయా దేశాలతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు సోమవారం నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు అనుమతించారు. ఇక ఫ్రాన్స్‌, జర్మనీలతో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఎయిర్‌ ఫ్రాన్స్‌ ఈనెల 18 నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూర్‌, పారిస్‌ల మధ్య జులై 18 నుంచి ఆగస్ట్‌ 1 వరకూ 28 విమానాలను నడపనుంది. కాగా జులై 16 వరకూ వందే భారత్‌ మిషన్‌ కింద 2362 విమానాలు నడిచాయని, 3,16,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. చదవండి : స్పెషల్‌ విమానం.. అందులో ఒక్కడే

మరిన్ని వార్తలు