ఆ విమానాల ఆలస్యానికి వాళ్లే కారణం

28 May, 2015 12:30 IST|Sakshi
ఆ విమానాల ఆలస్యానికి వాళ్లే కారణం

విమానం గల్ఫ్ దేశాలకు వెళ్లిందంటేచాలు.. గంటల తరబడి రెస్ట్ కావాలంటుంది ఒకామె. ఇంకొకరు పైలట్ పదిసార్లు పిలిచిన తర్వాతగానీ క్యాబిన్ లోకి రాదు. మరొకరిపై ప్రయాణికులకు సర్వీస్ అందించే విషయంలో ఎప్పుడూ కంప్లయింట్సే. ఇవీ.. ఎయిర్ ఇండియా విమానాల్లో పనిచేస్తోన్న ఎయిర్ హోస్టెస్ పై తరచూ వినిపిస్తోన్న ఫిర్యాదులు. సమయానుసారంగా విధులు నిర్వర్తించడంలో వీరు కనబరుస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎయిర్ ఇండియా సర్వీసుల్లో 30 శాతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

దీంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఏకంగా 17 మంది ఎయిర్ హోస్టెస్ లను గురువారం సస్పెండ్ చేశారు. బాధ్యతగల క్యాబిన్ క్రూ మెంబర్లుగా సమయపాలన పాటించాలని ఇప్పటికే మూడునాలుగు సార్లు హెచ్చరించాం. అయినాసరే వారి ప్రవర్తనలో మార్పులేదు. ఆన్ టైమ్ ప్రెజెన్స్ (ఓటీపీ)ను పాటించకుండా సంస్థను నష్టాలపాలుచేసేలా వ్యవహరించినందుకే 17 మందిని విధుల నుంచి తొలిగించామని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొన్నారు.

ఈ తొలిగింపులతో ఇప్పటివరకు ఎయిర్ ఇండయా సస్పెండ్ చేసిన ఎయిర్ మోస్టెస్ ల సంఖ్య 272కు పెరిగింది. న్యూయార్క్, బోస్టన్ లకు డైరెక్ట్ సర్వీసులు నడుపుతూ ఉత్తర అమెరికాలో విమాన సేవలు అందిస్తోన్న ఏకైక భారతీయ సంస్థగా పేరున్న ఎయిర్ ఇండియా.. తర్వరలోనే అమెరికా, యూరప్ లలో తన సేవలను విస్తృతం చేయనుంది. ఈ నేపథ్యంలో సమయపాలన, సేవల విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది.

మరిన్ని వార్తలు