మళ్లీ ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘం

5 Nov, 2018 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరాన్ని సోమవారం నాడు కాలుష్యం మేఘం మళ్లీ కమ్మేసింది. వాహనాల రాకపోకల రద్దీ, ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో పంట పొలాల దుబ్బును తగుల బెడుతుండడంతో నగర పరిసరాల్లో వాయు కాలుష్యం గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరిగింది. కాలుష్యం నియంత్రణ కోసం నవంబర్‌ ఒటక తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోగా, ఆదివారం నాటికి కాస్త తగ్గి సోమవారం నాడు మళ్లీ పెరిగింది. ఈ రోజు ఉదయం పూట వాయు కాలుష్యం మేఘంలా ఆకాశాన్ని ఆవహించడంతో వాహనాల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి.ఈ రోజు చాందినీ చౌక్‌ వద్ద ‘పీఎం 2.5 (గాలిలో 2.5 మైక్రో మీటర్ల కన్నా తక్కుక సైజు ధూళికణాలు)’491, పీఎం 10 (పది మైక్రో మీటర్ల కన్నా తక్కువైన) 444గా, ఆర్కే పురంలో పీఎం 2.5–426, పీఎం 10–351గా వాయు కాలుష్య సూచికపై నమోదయ్యాయి. ఢిల్లీ అంతటా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సరాసరిన కాలుష్యం 209గా నమోదయింది. కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డు ప్రకారం గాలిలో కాలుష్యం 0–50 వరకుంటే మంచిదిగాను, 51 నుంచి 100 వరకుంటే సంతప్తికరంగానూ, 101 నుంచి 200 వరకు ఫర్వాలేదని, 201 నుంచి 300 బాగా లేదని, 301 నుంచి 400 వరకు మరీ బాగా లేదని, 401 నుంచి 500 వరకు తీవ్రమైనదిగాను పరిగణిస్తారు.

ఢిల్లీ కాలుష్యంలో 24 శాతం హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంటల  దుబ్బును తగులబెట్టడం వల్ల కలుగుతుందని నిపుణుల అంచనా వేశారు. ఢిల్లీ వాతావరణంలో నైట్రోజెన్‌ డయాక్సైడ్‌తోపాటు, బెంజిన్, కార్సినోజెన్‌ కాలుష్య కణాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాల పెట్రోలు, డీజిల్‌ కారణంగా వాతావరణంలోకి  నైట్రోజెన్‌ డయాక్సైడ్‌ వెలువడుతుంది. మిగతా కాలుష్య కణాలకు పంట దుబ్బలు తగులబెట్టడం, ఫ్యాక్టరీలు కారణం. కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఒక్క శుక్ర, శనివారాల్లోనే 80 లక్షల రూపాయల జరిమానాలను విధించారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ ప్రత్యేక చర్యలు ఈ నెల పదవ తేదీ వరకు కొనసాగుతాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇరాన్, అమెరికా యుద్ధం జరిగేనా?!

‘బాలాకోట్‌ తర్వాత పాక్‌ ఆ దుస్సాహసం చేయలేదు’

కుటుంబసభ్యుల నిర్లక్ష్యానికి బాలుడు బలి

చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

నా కోసం.. నా ప్రధాని

జలం కోసం నిరసన గళం

సూపర్‌ సర్పంచ్‌

అలహాబాద్‌ హైకోర్టు జడ్జిని తొలగించండి

పర్సు కొట్టేసిన ఎయిరిండియా పైలట్‌

ఆకట్టుకుంటున్న మోదీ మ్యాంగో

‘కనీస వేతనాల ఖరారు బాధ్యత రాష్ట్రాలదే’

నటి ఇంటి సమీపంలో కంటైనర్‌ కలకలం

ఇతరులూ కాంగ్రెస్‌ చీఫ్‌ కావొచ్చు

కలవరపెట్టిన పాక్‌ సబ్‌మెరైన్‌

అమెరికా నివేదికపై భారత్‌ ఆగ్రహం

రాజస్తాన్‌లో కూలిన పందిరి

బైబై ఇండియా..!

ఫిరాయింపులపై టీడీపీ తీరు హాస్యాస్పదం

ఆ వ్యక్తి కాంగ్రెస్‌ చీఫ్‌ కావచ్చు కానీ..

పండిట్‌ నెహ్రూపై విరుచుకుపడ్డ జేపీ నడ్డా

ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి

దీదీ ఆయన బాటలో నడిస్తే..

వారితో పొత్తు కారణంగానే దారుణ ఓటమి..

మాయావతి కీలక నిర్ణయం

జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్‌

నన్నూ, మోదీని చంపుతామంటున్నారు!

‘దారికొస్తున్న కశ్మీరం’

యూఎస్‌పై భారత్‌ ఆగ్రహం

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?

చిన్నారుల మరణం; వైద్యుడిపై వేటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

బెంబేలెత్తిపోయిన తమన్నా

మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్‌

ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటి?

ప్రజలతోనూ మమేకం అవుతాం