విమాన భోజనంలో బొద్దింక

2 May, 2018 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఒక్కసారి విమానంలో దోమలు, మరోసారి వారు అందించే ఆహారంలో పురుగులు, బొద్దింకలు. తాజాగా ఎయిర్‌ విస్తార విమానం ఆఫర్‌ చేసిన ఆహారంలో బొద్దింకను గుర్తించినట్టు ఓ ప్రయాణికులు మంగళవారం ఫిర్యాదు చేశాడు. అయితే ప్రయాణికుడి ఫిర్యాదుని ఆ విమానయాన సంస్థ కొట్టివేసింది. ట్విటర్‌ను వేదికగా తీసుకుని, తన ఆహారంలో బొద్దింక ఉందంటూ ప్రయాణికుడు ట్వీట్‌ చేశారు. బొద్దింకను చూసి తాను అవాక్కైనట్టు పేర్కొన్నాడు. ఆ ప్రయాణికుడు ట్వీట్‌కి సమాధానమిచ్చిన విమానయాన సంస్థ, ఆహారంలో ఎలాంటి కీటకాలు లేవు. ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎల్లప్పుడూ చెక్‌ చేస్తూనే ఉంటామని విస్తారా ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. 

అయితే తాము కలిగించిన అంతరాయానికి చింతుస్తున్నామని, ప్రతి రోజూ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌ డోర్లను తెరచి ఉంచుతామని, కొన్నిసార్లు కీటకాలు లోపలికి చొరబడే అవకాశముందని, అయినప్పటికీ ఎప్పడికప్పుడూ తాము ఎయిర్‌క్రాఫ్ట్‌ను శుభ్రపరుస్తామని ఈ విమానయాన సంస్థ వరుస ట్వీట్లు చేసింది. కొన్ని రోజుల క్రితమే విమానంలో దోమలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని ఇండిగో సిబ్బంది కిందకి దించేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది.  

మరిన్ని వార్తలు