తప్పిన ప్రమాదం, విమానంలో మంత్రి

4 Mar, 2020 13:04 IST|Sakshi

వడగళ్ల వానతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మంత్రి అరూప్‌ బిశ్వాస్‌ సహా, 171మంది ప్రయాణికులు

సాక్షి, కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిస్వాస్‌తో సహా 171 మంది ప్రయాణికులతో  బాగ్డోగ్రాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. దీంతో అధికారులు  సహా, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్‌ అయిన వెంటనే వడగండ్ల వర్షం కురవడంతో పైలట్‌ అప్రమత్తమై తిరిగి అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని విమానయాన సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విండ్‌షీల్డ్‌కు నష్టం వాటిల్లిందనే అనుమానంతో పైలట్‌  ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.  ప్రయాణీకుల  భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని,  ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ విమానయాన సంస్థ ముఖ్య భద్రతా అధికారి క్షమాపణలు చెప్పారు.

మరిన్ని వార్తలు