ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని హైకోర్టు తీర్పు

21 Nov, 2017 09:23 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని మధ్యలో ఉన్న 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని తీర్పునిచ్చింది. హనుమాన్‌ ఉన్న ప్రాంతంలో ప్రదేశాలు దురాక్రమణకు గురయ్యాయనే ఓ నాన్‌ గవర్నమెంటల్ ఆర్గనేషన్‌(ఎన్‌జీవో) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూఢిల్లీలోని కరోల్‌ బాగ్‌ ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహం ఉంది. దీంతో అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేవుడిని ఆసరగా చేసుకుని ఆ ప్రాంతంలోని ప్రదేశాలపై కొందరు దురాక్రమణ జరిపారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విన్న హైకోర్టు.. అమెరికా మాదిరి విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి మరో చోట ప్రతిష్టించాలని తీర్పు చెప్పింది. ఇందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు