దింపినందుకు రూ.35 లక్షల జరిమానా

1 Sep, 2018 05:22 IST|Sakshi

చండీగఢ్‌: ఓ మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు రెండు విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్‌ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ కెనడా సంస్థలను ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్‌ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు, మూడేళ్ల కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు.

తొలుత ఢిల్లీ వెళ్లేందుకు మొహాలీలోని చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానమెక్కారు. తర్వాత ఢిల్లీలో ఎయిర్‌ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు తీషా తాళంవేసి ఉన్న వాష్‌రూం వద్ద చాలాసేపు ఆగి చివరకు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ కేకలువేస్తూ మినాలీ, ఆమె కుమార్తె, కొడుకును విమానం నుంచి బలవంతంగా విమాన సిబ్బంది దింపేశారు. వారి లగేజీని ఢిల్లీ విమానాశ్రయంలో దించకుండా టొరంటోకు తీసుకెళ్లారు.

>
మరిన్ని వార్తలు