మూడు వారాల్లోగా రీఫండ్ మ‌నీ: డీజీసీఎ

16 Apr, 2020 18:22 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : విమాన ప్రయాణికులకు కేంద్రం ప్రకటన ఊరటనిచ్చింది. లాక్‌డౌన్ నేపధ్యలో రద్దు చేసుకున్న విమాన టికెట్ల పూర్తి ఛార్జీలు వాపస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించింది. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని డీజీసీఏకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

దీంతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మ‌ధ్య విమాన టికెట్ల‌ను బుక్ చేసుకున్న‌వారికి మూడు వారాల్లోగా రీఫండ్ డ‌బ్బులు అందించాల్సిందిగా అన్ని ఎయిర్‌లైన్స్‌ని డీజీసీఏ ఆదేశించింది. ఈ మేర‌కు గురువారం డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బుకింగ్స్ ర‌ద్దుకు క్యాన్స‌లేష‌న్ ఛార్జీలు విధించడ‌బ‌డవ‌ని పేర్కొంది. అంతేకాకుండా ఏప్రిల్ 14 నుంచి మే3 మ‌ధ్య‌కాలంలో టికెట్స్ బుక్ చేసుకున్న‌వారికి సైతం ఇదే ప‌ద్ధ‌తి వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది.

21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14న ముగియ‌నుండ‌గా, క‌రోనా క‌ట్ట‌డి దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగ‌తి తెలిసిందే. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేవంలో 414 మంది కోవిడ్ కార‌ణంగా చ‌నిపోయారు. ప‌రిస్థితి మెరుగుప‌డే వ‌ర‌కూ అన్ని దేశీయ‌, విదేశీ విమాన‌ సేవ‌ల‌ను నిలిపివేస్తూ కేంద్రం  నిర్ణ‌యం తీసుకుంది. మే3 తో లాక్‌డౌన్ ముగియ‌నుండ‌టంతో విమాన‌యాన స‌ర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తార‌న్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. 
 

మరిన్ని వార్తలు