హిందూ, ముస్లిం మత పెద్దలతో దోవల్‌ భేటీ

10 Nov, 2019 19:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు నేపథ్యంలో హిందూ ముస్లిం మత పెద్దలతో ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో భేటీ అయ్యారు. యోగా గురు బాబా రాందేవ్‌, స్వామి పరమాత్మానంద్, స్వామి చిదానంద్ సరస్వతి, అవదేశానంద మహరాజ్‌, షియా క్లరిక్‌ మౌలానా కల్బేజవాద్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తీర్పు తదనంతర పరిణామాలపై చర్చించారు. 

ప్రతిష్ఠాత్మక కేసులో తీర్పు వెలువడిన సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా ఇరువర్గాలు సంయమనం పాటించిన తీరును అజిత్ దోవల్‌ ప్రశంసించారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంతోపాటు భవిష్యత్‌లోనూ సామరస్యంగా వ్యవహరించాలని సంయుక్త తీర్మానం ఆమోదించాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా