మరిన్ని చర్యలు తప్పవంటూ పాక్‌ను హెచ్చరించిన దోవల్‌

19 Mar, 2019 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ఎన్నటికి మర్చిపోమని.. మరిన్ని చర్యలు తీసుకుంటామని జాతీయా భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పాక్‌ను హచ్చరించారు. 80 సీఆర్పీఎఫ్‌ రైజింగ్‌ డే కార్యక్రమానికి హాజరైన దోవల్‌ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోనే శక్తి, సామర్థ్యాలు దేశ నాయకత్వానికి ఉన్నాయన్నారు. పుల్వామా ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మరచిపోరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి దాడులను తిప్పికొట్టడంలో నాయకులు దీటుగా స్పందిస్తారని తెలిపారు. శత్రుమూకలకు ఎప్పుడు.. ఎలా.. సమాధానం చెప్పాలో నిర్ణయించడానికి మన నాయకుల ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలకు సైతం దీటుగా సమాధానం చెప్పే సత్తా మన దేశానికి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాక ‘క్లిష్ట పరిస్థితుల్లో ఏ బలగాలను పంపాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు మాకు టక్కున గుర్తుకు వచ్చేది సీఆర్పీఎఫ్‌ పేరే. ఈ బలగాల పట్ల మాకు చాలా విశ్వాసం ఉంది. ఏళ్లుగా ఆ విశ్వాసాన్ని అలా నిలుపుకుంటున్నాయ’ని తెలిపారు. అంతేకాక దేశ భద్రతకు జవాన్లు అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఆయన నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు