రక్త కన్నీరు..

12 Feb, 2017 01:26 IST|Sakshi
రక్త కన్నీరు..

ఈ పిల్లాడి పేరు అఖిలేశ్‌ రఘువంశీ(10). మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఉంటాడు. తండ్రి వ్యవసాయదారుడు. చూశారుగా.. సమస్య ఏమిటో.. ఒక్క కంటి నుంచే కాదు.. తల నుంచి.. చెవి నుంచి.. ముక్కు నుంచి.. కాళ్ల నుంచి రక్తం ధారలా కారుతుందట. ఒక్కోసారి రోజుకు 10 సార్లు వస్తే.. ఒక్కోసారి మూడు నెలల వరకూ దాని జాడే కనిపించదట. మూడేళ్ల నుంచి అఖిలేశ్‌ ఈ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. చాలా మంది డాక్టర్లు చూశారు.

ఎయిమ్స్‌ వైద్యులు సైతం పరీక్షించారు. కారణం ఇదీ.. అని ఎవరూ చెప్పలేకపోయారు. దెబ్బ తగలకున్నా.. రక్తం కారిపోతూ ఉంటుందని.. ఇలా వచ్చినప్పుడు తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందని అఖిలేశ్‌ చెబుతున్నాడు. ఇతడు ‘హీమోలక్రియా’ తో బాధపడుతుండొచ్చని చెబుతున్నప్పటికీ.. పూర్తిగా నిర్ధారించడం లేదు. హీమోలక్రియాతో బాధపడుతున్నవారి కంటి నుంచి రక్తం వస్తుంటుంది.  వైద్యులు ఏదీ సరిగా చెప్పకపోవడంతో తన కొడుకు ఏమైపోతాడా అన్న ఆందోళన అతడి తండ్రిలో నెలకొంది. ప్రపంచంలో పేరుగాంచిన వైద్యులు అఖిలేశ్‌కు వచ్చిన వ్యాధికి చికిత్సను సూచించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు