ప్రస్తుత ముఖ్యమంత్రికే మరో చాన్స్

17 Oct, 2016 17:03 IST|Sakshi
ప్రస్తుత ముఖ్యమంత్రికే మరో చాన్స్

వచ్చే సంవత్సరం జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉంటారన్నది గందరగోళంగా మారింది. స్వయానా పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్లు ఎవరూ ఆటోమేటిగ్గా సీఎం అభ్యర్థులు కాబోరని చెప్పి అందరినీ అయోమయంలో పారేశారు. అయితే.. ఆయన సన్నిహిత అనుచరుడు ఒకరు మాత్రం 2017 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవేనని కుండ బద్దలుకొట్టారు. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహిత అనుచరుడైన కిరణ్మయ్ నందా ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అఖిలేష్ యాదవ్‌ను ఇంతకుముందు గట్టిగా వ్యతిరేకించిన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కూడా రాబోయే ఎన్నికల్లో అఖిలేష్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను సమర్థిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ సీనియర్ నాయకుడు రాంగోపాల్ యాదవ్ తాజాగా అన్నయ్య ములాయంకు ఒక లేఖ రాశారు. అందులో.. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 సీట్లకు గాను వంద కంటే తక్కువ స్థానాల్లో గెలిస్తే.. దానికి ములాయమే ఏకైక బాధ్యుడు అవుతారని అందులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు