మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం

13 Jul, 2020 03:44 IST|Sakshi

ఐటీబీపీ డీజీ ఎస్‌.ఎస్‌.దేశ్వాల్‌

న్యూఢిల్లీ/గుర్గావ్‌: దేశానికి చెందిన భూభాగం యావత్తూ మన భద్రతా బలగాల పూర్తి రక్షణలోనే ఉందని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎస్‌.దేశ్వాల్‌ స్పష్టం చేశారు. ఆదివారం గుర్గావ్‌లో బీఎస్‌ఎఫ్‌ ఆధ్వ ర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జనరల్‌ దేశ్వాల్‌ మాట్లాడు తూ..‘మన దేశ భూభాగమంతా మన చేతుల్లోనే ఉంది. పూర్తిగా మన భద్రతా బలగాల అధీనంలోనే ఉంది. మన సరి హద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి.

మన బలగాలు చురుగ్గా, సమర్ధంగా, అం కితభావంతో పనిచేస్తున్నాయి. సరిహ ద్దుల్లో ఎలాంటి శత్రువునైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని తెలిపారు.  కాగా, ఫింగర్‌ –4 వద్ద మోహ రించిన బలగాల్లో మరికొన్నిటినీ, పాంగాం గ్‌ సో సరస్సులో ఉన్న కొన్ని గస్తీ పడవలను చైనా ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణ పూర్తిగా చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలకు తుదిరూపం ఇచ్చేందుకు భారత, చైనా బలగాల మధ్య మరో విడత  చర్చలు జరగనున్న నేప థ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు