జీఎస్టీలో అన్ని వివరాలు నమోదు కావాల్సిందే

21 Apr, 2017 01:51 IST|Sakshi
జీఎస్టీలో అన్ని వివరాలు నమోదు కావాల్సిందే

న్యూఢిల్లీ: జీఎస్టీ చట్టం అమల్లోకి వస్తే.. వస్తువులు పోయినా, చోరీకి గురైనా, దెబ్బతిన్నా పూర్తి సమాచారం తప్పకుండా నమోదు చేయాలని సీబీఈసీ (కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్‌ బోర్డు) పేర్కొంది. ఈ మేరకు జీఎస్టీ నమూనా నిబంధనలు విడుదల చేస్తూ... ఉచితంగా ఇచ్చే వస్తువులు, బహుమతుల వివరాల్ని కూడా తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఖాతా పుస్తకాలకు వరుస సంఖ్యలు కేటా యించాలని, రిజిస్టర్‌లు, పత్రాల్లో నమోదు చేసిన సమాచారం చెరపడం, కొట్టి వేయడం, దిద్దడం చేయకూడదని జీఎస్టీ నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రతి పనికి ప్రత్యేక ఖాతాను నిర్వహించాలని, వస్తువుల తయారీ, వర్తకం, సేవలకు వేర్వేరు ఖాతాలు కొనసాగించాలని సూచించారు.

వస్తువులు, సేవలకు సంబంధించి నిజమైన, సరైన సమాచారంతో కూడిన ఖాతాలతో పాటు సంబంధింత పత్రాలైన ఇన్‌వాయిస్‌లు, సరఫరా బిల్లులు, డెలివరీ చలానాలు, క్రెడిట్, డెబిట్‌ నోట్స్, రసీదులు, చెల్లింపుల వోచర్లు, వాపసు వస్తువుల వోచర్లు, ఈ–వే బిల్లులు తప్పకుండా ఉండాలని జీఎస్టీ నిబంధనల్లో స్పష్టం చేశారు. ముందస్తు వసూళ్లు, చెల్లింపులు, సర్దుబాట్లకు కూడా ప్రత్యేక ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు