దేశీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం

23 Mar, 2020 17:34 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం వారం రోజుల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మంగళవారం(మార్చి24) అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విమానయాన శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే విమానయాన సంస్థలు మంగళవారం రాత్రి 11.59 గంటలకు ముందే తమ సర్వీసులు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే కార్గో విమాన సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. 

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లను రద్దు చేయడంతోపాటు, అంతరాష్ట్ర రవాణాను రద్దు చేసింది. అలాగే దేశంలోని దాదాపు 80 జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. పలు రాష్ట్రాలు కూడా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

చదవండి : కరోనానుంచి కోలుకున్న హీరోయిన్‌

లాక్‌డౌన్‌ : రోడ్లపైకి జనం.. కలెక్టర్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు