నేడే రైల్వే బడ్జెట్

25 Feb, 2016 07:14 IST|Sakshi
నేడే రైల్వే బడ్జెట్

న్యూఢిల్లీ: ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను పెంచాలా వద్దా అన్న ఊగిసలాట నడుమ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంటులో 2016-17 రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తగ్గిన ఆదాయం, ప్రాజెక్టులకు నిధులు, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాల ఆవశ్యకత నేపథ్యంలో బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే త్వరలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, డీజిల్ ధర తగ్గడం వంటివాటి వల్ల చార్జీల పెంపు మంచి కాదని రైల్వే శాఖలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ‘ప్యాసింజర్, సరుకు లోడింగ్ బుకింగ్‌లు తగ్గాయి. ఇప్పుడు చార్జీలను పెంచితే రైల్వే దెబ్బతింటుంది.’ అని రైల్వే వర్గాలు చెప్పాయి.

ప్రజల అవసరాలను సంతృప్తికరంగా తీర్చేలా బడ్జెట్ ఉంటుందని ప్రభు బుధవారం చెప్పారు. దేశ, రైల్వే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించామన్నారు. చార్జీలు ఆశించిన విధంగా నిర్ణయించని నేపథ్యంలో రైల్వే వనరులు నిత్యం తగ్గిపోతున్నాయని లోక్‌సభలో చెప్పారు.
 
బడ్జెట్‌లో ఏమేం ఉండొచ్చంటే..
ఆదరణ ఉన్న రూట్లలో అధిక చార్జీలతో పలు ప్రత్యేక రైళ్లు. లోడింగ్  ప్రోత్సాహం కోసం హైస్పీడ్ పార్సిల్ రైళ్లు. డీజిల్‌తోపాటు, విద్యుత్ రైళ్లు. ముంబైలో ఏసీ సబర్బన్ రైళ్లు, తర్వాత మిగతా ప్రాంతాల్లోకి విస్తరణ. బయో టాయిటెట్లు, వాక్యూమ్ టాయిలెట్లు, ప్రతి బోగీలో చెత్తకుండి. ఈ-కేటరింగ్ వ్యవస్థ. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పరిచే 400 స్టేషన్లను గ్రీన్ స్టేషన్లుగా ప్రకటించే అవకాశం. తొలి బుల్లెట్ రైలు(ముంబై-అహ్మదాబాద్)కు సంబంధించి జపాన్‌తో ఒప్పందం.

మరిన్ని వార్తలు