ఎంపీల బహిష్కరణపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన

11 Feb, 2014 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు ఎంపీల బహిష్కరణ వేటుపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదలు చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చేసిన సిఫార్సును సోనియాగాంధీ ఆమోదించటంతో తొలగింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది వెల్లడించారు.

మరోవైపు బహిష్కరణకు గురైన ఎంపీలు ...కాంగ్రెస్ పార్టీనీ దుమ్మెత్తి పోస్తున్నారు. తమపై వేటు వేసిన కాంగ్రెస్ పార్టీని...వచ్చే ఎన్నికల్లో ప్రజలే వేటు వేస్తారని వ్యాఖ్యానించారు.  లగడపాటి రాజగోపాల్, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్లను పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు