అనుకున్నదే అయింది

10 Feb, 2017 21:23 IST|Sakshi
అనుకున్నదే అయింది
పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్ధ అధినేత మసూద్‌ అజర్‌పై నిషేధంపై చైనా జిత్తులు మారి వేషాలు మానుకోవడం లేదు. అజర్‌పై నిషేధానికి అమెరికా యూఎన్‌ కౌన్సిల్‌లో ప్రతిపాదన చేయడం ఆ తర్వాత చైనా మరలా ససేమీరా అన్న విషయం తెలిసిందే. 
 
ప్రతిపాదనను ప్రతిసారీ అడ్డుకుంటున్న చైనాపై యూఎన్‌ కౌన్సిల్‌ సభ్య దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్‌ పావులు కదిపింది. అజర్‌పై నిషేధాన్ని విటోతో అడ్డుకోవడంపై చైనాకు దౌత్యపరంగా వ్యతిరేక గొంతు వినిపించింది. భారత్‌ వ్యాఖ్యలపై స్పందించిన చైనా యూఎన్‌ కౌన్సిల్‌లోని సభ్యులు అందరూ టెర్రరిజం వ్యతిరేకం కార్యక్రమంలో భాగస్వాములేనని చెప్పింది. (చదవండి:అజర్‌కు చైనా రక్ష.. భారత్‌కు లాభం..!)
 
అందరూ నియమాలను అనుసరిస్తున్నారని ఉద్ఘాటించింది. భారత్‌ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. నిషేధానికి కొన్ని సాంకేతిక సమస్యలున్నాయనే పాత మాటనే పదే పదే ప్రస్తావించింది. తాము యూఎన్‌ నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని పేర్కొంది.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా