ఆధార్‌ : లాయర్లకు దానికి అనుమతివ్వండి

10 Apr, 2018 09:24 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆధార్‌ కార్డు లేనప్పటికీ రిటర్నులు దాఖలు చేసే అనుమతి న్యాయవాదులకు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌ కార్డు వివరాలు ఇ‍వ్వన్నప్పటికీ అనుమతి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదులు ముకుల్‌ తల్వార్‌, వ్రిండా గ్రోవర్‌లు దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించాలని  రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు డివిజిన్‌ బెంచ్ నోటీసులు కూడా పంపింది. తదుపరి విచారణ మే 14న చేపట్టనున్నారు. 

ప్రస్తుతం ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్‌ చేసుకునే తుది గడువు జూన్‌ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆధార్‌ చట్టాన్ని కేంద్రం సుప్రీంకోర్టులో సమర్థించుకుంటూ వస్తోంది. ఇది ఒక సరసమైన, సహేతుకమైన చట్టంగా కేంద్రం అభివర్ణిస్తోంది. గోప్యతా హక్కు విషయంలో చారిత్రక తీర్పుకు ఇది కట్టుబడి ఉందని తెలిపింది. కాగ, గతేడాది ఆగస్టులో గోప్యత హక్కు, ప్రజల ప్రాథమిక హక్కు అని తొమ్మిది సభ్యుల రాజ్యాంగ బెంచ్‌ చారిత్రక తీర్పు వెలువరించింది. మరోవైపు ఆధార్‌ స్కీమ్‌ వాలిడిటీపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్‌తో విచారిస్తోన్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు