-

పార్టీని వీడేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..

28 May, 2019 13:49 IST|Sakshi

అహ్మదాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామాల బాటపడుతున్నారు. ఇక కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ప్రభుత్వాలను అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు కలవరపెడుతున్నాయి. మరోవైపు గుజరాత్‌లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధఃగా ఉన్నారని ఆ పార్టీ మాజీ నేత, ఓబీసీ నాయకుడు అల్పేష్‌ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోందని, పార్టీ ఇదే పనితీరును కనబరిస్తే మరో పదేళ్లు పైగా అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్ధితి అనివార్యమని హెచ్చరించారు. సరైన నాయకుడు లేకపోవడంతో గుజరాత్‌లో పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, సగానికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక నాయకత్వ లక్షణాల్లో ప్రధాని మోదీతో రాహుల్‌ గాంధీని పోల్చలేమని, మోదీతో రాహుల్‌ సరితూగలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ టికెట్‌పై పటాన్‌ జిల్లా రతన్‌పూర్‌ నుంచి ఎన్నికైన అల్పేష్‌ ఠాకూర్‌ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైదొలిగారు.

మరిన్ని వార్తలు