భారీ వర్షాలతో నిలిచిన అమర్‌నాథ్‌ యాత్ర

13 Aug, 2018 13:11 IST|Sakshi

జమ్మూ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం జమ్మూలో అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి యాత్రను రద్దు చేశామని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి యాత్రికులను అమర్‌నాథ్‌ వైపు అనుమతించలేదని చెప్పారు.

జూన్‌ 28న రెండు మార్గాల్లో ప్రారంభమైన 60 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్టు 26న రక్షా బంధన్‌ రోజు ముగియనుంది. కాగా ఆదివారం సాయంత్రం వరకూ 2,78,878 మంది యాత్రికులు అమర్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. మరోవైపు అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడవచ్చనే ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో యాత్ర సాగే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు