‘రద్దు’.. గురిలేని క్షిపణి

29 Jan, 2017 02:46 IST|Sakshi
‘రద్దు’.. గురిలేని క్షిపణి

నోట్ల రద్దుపై అమర్త్యసేన్
ముంబై: పెద్ద నోట్ల రద్దు లక్ష్యం లేకుండా ఏకపక్షంగా ప్రయోగించిన క్షిపణి అని, ఎన్డీఏ సర్కారు ప్రజాస్వామిక సంప్రదాయాలను తుంగలో తొక్కి ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్  విమర్శించారు. ‘ఇది హడావుడిగా నిరంకుశత్వంతో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం తరచూ గురిలేని క్షిపణులను ప్రయోగిస్తోంది. నోట్లరద్దు అందులో ఒకటి..’ అని ఆయన శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చైనాలో కొద్దిమంది ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని, కానీ భారత్‌ వంటి ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు