పులికి మిమిక్రీ చేయడం తెలుసు

30 Nov, 2019 12:27 IST|Sakshi
  • పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమ వడానికి కాస్త సమయం పడుతుంది!
  • పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా తేలికగా చంపేయగలదు!
  • తమ ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! 
  • పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు!
  • ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి!
  • ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి!

     
  • ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు!
  • పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి!
  • పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు! 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా బాధితుడితో మోదీ మన్‌ కీ బాత్‌ 

లాక్‌డౌన్‌: కేంద్రం కీలక ఆదేశాలు!

200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి

ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ

ఫోక్‌ సింగర్‌, నటి మునియమ్మ కన్నుమూత

సినిమా

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

కష్టాల్లో సినీ కార్మికులు : అండగా నిలిచిన మాస్‌ మహారాజా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ