దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

14 Apr, 2018 11:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ‘విశ్వ మానవుడి’గా అభివర్ణించారు. పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనెత్తేందుకు, హక్కులను సాధించుకునేందుకు అంబేద్కర్‌ వారికి గొంతుక నిచ్చాడని మోదీ పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో అంబేద్కర్‌ పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశారని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు