లాక్‌డౌన్‌: నిత్యావసరాలకు కొత్త ఆలోచన!

19 Apr, 2020 17:37 IST|Sakshi

శ్రీనగర్‌: కరోనా లాక్‌డౌన్‌తో తలెత్తిన విపత్కర పరిస్థితుల నుంచి కొద్దిమేర గట్టేందుకు శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ) కొత్త ఆలోచనకు తెరలేపింది. ఇంటి ఆవరణ, నివాసాల చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాల్లో పండ్లు, కూరగాయలు పండించాలని ప్రజలకు సూచించింది. ఇంటి పంటలతో లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితుల నుంచే కాకుండా.. నిరవధిక కర్ఫ్యూ విధించినప్పుడు కూడా తరచూ బయటకు రాకుండా ప్రజలు సురక్షితంగా ఇళ్లల్లోనే ఉండొచ్చని ఎస్‌ఎంసీ శనివారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో కిచెన్‌ గార్డెన్‌ను తప్పనిసరి చేస్తామని స్పష్టం చేసింది.
(చదవండి: భర్త స్నానం చేయడం లేదని భార్య ఫిర్యాదు)

ఇప్పటికే కిచెన్‌ గార్డెన్‌ పరికరాలను వ్యవసాయ విభాగం సబ్సిడీ ధరలకు అందిస్తోందని గుర్తు చేసింది. ఇక అధిక జనాభా ప్రాంతాల్లో ఒకటైన శ్రీనగర్‌లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలతో నిత్యావసరాలు లభించడం కష్టమవుతోంది. మరోవైపు శ్రీనగర్‌కు ప్రధాన మార్గమైన శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై రాకపోకలు వాతావరణ పరిస్థితులకు లోనై ఉంటాయి. కొండలు, గుట్టలతో ఉండే ఆ రహదారిపై ప్రయాణం మంచుకురియడంతో సంక్లిష్టంగా మారుతుంది. కొండ చరియలు విరిగిపడిపోవడంతో రాకపోకలు స్తంభించి సరుకు రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయి.
(చదవండి: వలస కూలీలు: కేంద్రం కీలక మార్గదర్శకాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు