గాల్వన్‌‌‌ పేరు వెనక గల కథను వివరించిన అమీన్‌ గాల్వన్‌‌

18 Jun, 2020 19:27 IST|Sakshi
రసూల్‌ గల్వాన్‌ మనవడు అమీన్‌ గల్వాన్‌

న్యూఢిల్లీ: గాల్వన్‌‌‌ లోయ ఇప్పుడు.. ఎప్పుడు భారతదేశంలో భాగమని అమీన్‌ గాల్వన్‌‌‌ అన్నారు. ప్రముఖ సాహసికుడు గులాం రసూల్‌ గాల్వన్‌‌‌ పేరు మీదుగా ఈ ప్రాంతానికి గాల్వన్‌‌‌ లోయ అనే పేరు వచ్చింది. ఆ రసూల్‌ గాల్వన్‌‌‌ మనవడే ఈ అమీన్‌ గాల్వన్‌‌ ఈ క్రమంలో లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం రాత్రి  గాల్వన్‌‌లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.

చైనా మాత్రం ఇప్పటి వరకు తమ సైనికులు ఎంతమంది చనిపోయారో అధికారికంగా ప్రకటించలేదు. గాల్వన్‌‌‌  ఘటన తర్వాత ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల వైరంపై గల్వాన్ మనవడు అమీన్ గాల్వన్‌‌ స్పందించారు. ఈ ప్రాంతం ఎప్పటికి భారతదేశంలో భాగమని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఆ పేరు రావడం వెనక ఉన్న కథను వివరించారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు!)

‘మా తాత రసూల్‌ గాల్వన్‌‌‌ 1878 లో లేహ్‌లో జన్మించాడు. 12 సంవత్సరాల వయసులో టిబెట్, మధ్య ఆసియాలోని పర్వతాలు, ముఖ్యంగా కారకోరం రేంజ్‌లో బ్రిటిష్ వారికి  గైడ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 19వ శతాబ్దంలో భారత్‌ను పాలిస్తున్న బ్రిటీషర్లు రష్యా ఆక్రమణల గురించి భయపడుతుండేవారు. ఆ సమయంలో మా తాత రష్యన్ల గురించిన సమాచారాన్ని బ్రిటీష్‌ వారికి చేరవేస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ సారి లాడ్‌ డ్యూనమోర్‌ అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చాడు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పారు. అప్పుడు వారికి గైడ్‌గా ఉన్న మా తాత కొత్త మార్గాన్ని అన్వేషించి వారిని చావు నుంచి కాపాడి.. క్షేమంగా తిరిగి తీసుకొచ్చాడు. అందుకు కృతజ్ఞతగా బ్రిటీషర్లు డన్మోర్‌ లోయ, నదికి మా తాత రసూల్‌ గాల్వన్‌‌‌ పేరు పెట్టారు’ అని తెలిపాడు. 1962లో కూడా చైనా గల్వాన్‌ లోయ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించింది. కానీ ఈ ప్రాంతం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు భారతదేశంలో భాగం అన్నారు. (చైనాకు రైల్వే శాఖ షాక్‌.. ఒప్పందం రద్దు!)

మరిన్ని వార్తలు