అందుకే ప్రాణాలతో బయటపడ్డా..

15 May, 2019 16:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో మంగళవారం జరిగిన తన ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పధకం ప్రకారం హింసకు పాల్పడిందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆరోపించారు. హింసతో తమను అణగదొక్కలేరని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న దీదీకి బెంగాలీలు ఓటమి రుచిచూపుతారని ఆయన హెచ్చరించారు. రోడ్‌షో సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలను గుర్తుచేసుకున్న అమిత్‌ షా తాను అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డానని, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అక్కడ లేకుంటే తాను తప్పించుకోవడం కష్టమయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు.

తన రోడ్‌షోపై తృణమూల్‌ కాంగ్రెస్‌ బాహాటంగా అక్కసు వెళ్లగక్కిందని, ప్రధాని మోదీ పోస్టర్లు, తన పోస్టర్లను తృణమూల్‌ కార్యకర్తలు చించివేశారని, అయినా బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. రోడ్‌షోకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని అన్నారు. రోడ్‌షో సందర్భంగా బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం, అమిత్‌ షాపై తృణమూల్‌ శ్రేణుల రాళ్ల దాడి, సంఘ సం‍స్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహం కూల్చివేత ఘటనలు కలకలం రేపాయి.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థచే దర్యాప్తు జరిపించాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. బెంగాల్‌లో హింసాకాండకు తృణమూల్‌ కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. తృణమూల్‌ హింసకు ప్రేరేపిస్తోందన్న అమిత్‌ షా తన ఆరోపణలకు మద్దతుగా కొన్ని ఫోటోలను ప్రదర్శించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌