ఎన్పీడీఆర్‌ఆర్ చైర్మన్‌గా అమిత్‌ షా

7 Mar, 2020 10:59 IST|Sakshi
అమిత్‌ షా (ఫైల్‌)

న్యూఢిల్లీ: విపత్తు నిర్వహణకు ఉద్దేశించిన డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ జాతీయ వేదిక (ఎన్పీడీఆర్‌ఆర్‌)కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చైర్మన్‌గా ఉంటారు. ఇందులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు మంత్రులు ఉన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను సమాయనుగుణంగా పర్యవేక్షించడం, విపత్తు నిర్వహణ పాలసీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా ఎన్పీడీఆర్‌ఆర్‌ పర్యవేక్షించడంతో పాటు సలహాలు కూడా ఇస్తుంది.

విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌లు ఎన్పీడీఆర్‌ఆర్‌కు వైస్‌ చైర్మన్‌లుగా ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఓ మంత్రి, మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల మేయర్లు కూడా సభ్యులుగా ఉంటారు. (చదవండి: అవినీతి అధికారులకు కేంద్రం షాక్‌)

>
మరిన్ని వార్తలు