భద్రతతోనే ఆర్థికాభివృద్ధి : అమిత్‌ షా

28 Aug, 2019 14:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ భద్రత ఆర్థిక పురోగతికి అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. పోలీసు బలగాల ఆధునీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ దేశంలో భద్రతా పరిస్థితి మెరుగవకుంటే ఆర్థిక పురోగతి సాధ్యం కాదని చెప్పారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 49వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణలో భాగంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే రోజులకు కాలం చెల్లిందని, దీనికోసం శాస్ర్తీయ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దర్యాప్తు ప్రక్రియలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని తెలిపారు. దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేశంలో అంతర్గత భద్రతను మెరుగ్గా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా