ఇక ఆమిర్ స్థానంలో బిగ్‌ బీ, ప్రియాంక!

21 Jan, 2016 15:34 IST|Sakshi
ఇక ఆమిర్ స్థానంలో బిగ్‌ బీ, ప్రియాంక!

న్యూఢిల్లీ: నెలరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా'కు కొత్త బ్రాండ్‌ అంబాసిడర్లను కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసింది. ఇక 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచారంలో బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. వీరిద్దరినీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్టు తెలుస్తున్నది.

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా ఈ ప్రచారానికి ముఖచిత్రంలా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ సేవలందించారు. అయితే ఇటీవల మత అసహనంపై ఆమిర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి. దీంతో 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన కాంట్రాక్ట్‌ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో  ఇక భారత పర్యాటక రంగానికి ప్రచార సారథులుగా అమితాబ్, ప్రియాంక ప్రాచుర్యం కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు