అమితవ్‌ ఘోష్‌కు జ్ఞాన్‌పీఠ్‌

15 Dec, 2018 03:17 IST|Sakshi
అమితవ్‌ ఘోష్‌

న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞాన్‌పీఠ్‌ను ఈ ఏడాదికి ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్‌ ఘోష్‌ గెలుచుకున్నారు. ‘వినూత్న రచనలకు పేరొందిన అమితవ్‌ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని స్పృశించారు. గతాన్ని వర్తమానంతో అనుసంధానించారు’ అని జ్ఞాన్‌పీఠ్‌ అకాడమీ కొనియాడింది. ప్రముఖ సమకాలీన భారతీయ రచయితల్లో ఒకరైన అమితవ్‌కు షాడో లైన్స్, ది గ్లాస్‌ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్‌ నవలలు మంచి పేరు తెచ్చాయి.

బ్రిటిష్‌ పాలనలో భారత్, చైనాల మధ్య జరిగిన నల్లమందు వ్యాపార కాలక్రమాన్ని వివరిస్తూ సీ ఆఫ్‌ పాపీస్, రివర్‌ ఆఫ్‌ స్మోక్, ఫ్లడ్‌ ఆఫ్‌ ఫైర్‌ పేరిట వరుసగా మూడు నవలలు రాశారు. జ్ఞాన్‌పీఠ్‌కు ఎంపికవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమితవ్‌ అన్నారు. 1956లో కోల్‌కతాలో జన్మించిన అమితవ్‌.. ఢిల్లీ, ఆక్స్‌ఫర్డ్, అలెగ్జాండ్రియాలో చదివారు. ఆయన చివరగా రాసిన పుస్తకం ‘ ది గ్రేట్‌ డిరేంజ్‌మెంట్‌: క్లైమేట్‌ చేంజ్‌ అండ్‌ అన్‌తింకబుల్‌’ 2016లో విడుదలైంది. గతంలో అమితవ్‌కు పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. 

మరిన్ని వార్తలు