అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం

2 May, 2019 05:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రియల్టర్లు ప్రజలను మోసం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కైన బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కి ఆకాశహర్మాలు నిర్మిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో  అవకతవకలు చోటుచేసుకున్నాయని  అభిప్రాయపడింది. వినియోగదారుల్ని ఆమ్రపాలి గ్రూప్‌ మోసం చేసిందన్న సుప్రీంకోర్టు, అవినీతికి పాల్పడినవారికి మరణశిక్ష విధించలేమని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు