అమృత్‌సర్‌ ప్రమాదం : డబ్బులు అడుగుతున్న వైద్యులు

22 Oct, 2018 16:29 IST|Sakshi

అమృతసర్‌ : దసరా పండుగ నాడు రావణ దహనం సందర్భంగా పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వ ఆదేశించినప్పటికి లాభం లేకుండా పోయింది. రైలు ప్రమాద బాధితుల పట్ల ప్రైవేట్‌ ఆస్పత్రుల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటూ ప్రైవేట్‌ ఆస్పత్రులు బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఆగ్రహించిన జనాలు ప్రమాదం చోటు చేసుకున్న జోడా ఫాటక్‌ రైల్వే ట్రాక్‌ మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

పోలీస్‌ అధికారుల వచ్చి నిరసనకారులను శాంతింపచేసి అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అంతేకాక ఎవరైనా బాధితుని వద్ద నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రి వారు డబ్బు వసూలు చేస్తే, దాన్ని తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. శుక్రవారం నుంచి వైద్యం పొందుతున్న రైలు ప్రమాద బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు