ఏఎంయూలో జిన్నా ఫోటోపై రగడ

4 May, 2018 16:28 IST|Sakshi
అలీఘర్‌ ముస్లిం వర్సిటీలో ఉద్రిక్తత

సాక్షి, లక్నో : అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో మహ్మద్‌ జిన్నా చిత్రపటంపై వివాదం రాజుకుంది. విద్యార్థి సంఘ కార్యాలయంలో జిన్నా ఫోటో ఉండటంపై వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోటోను తొలగించేందుకు విద్యార్థి నేతలు అంగీకరించలేదు. తమపై పోలీసుల చర్యకు నిరసనగా తరగతులు బహిష్కరించాలని విద్యార్థులు పిలుపు ఇచ్చారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో రెండు రోజుల పాటు వర్సిటీలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయాలని జిల్లా మేజిస్ర్టేట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చరిత్రలో భాగం అయినందునే జిన్నా చిత్రపటాన్ని తాము తొలగించబోమని విద్యార్ధులు స్పష్టం చేశారు.

జిన్నా తమకు స్ఫూర్తిప్రదాత కాకున్నా భారత చరిత్రలో ఆయన ఒక భాగమని వారు చెబుతున్నారు. అన్సారీ పర్యటన నేపథ్యంలో వర్సిటీలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని వారు అసంతృప్తివవ్యక్తం చేశారు. కాగా జిన్నా చిత్రపటం వివాదంపై జరిగిన ఘర్షణల్లో 40 మంది విద్యార్థులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.ఏఎంయూలో జిన్నా చిత్రపటం ఉంచడాన్ని హిందూ యువ వాహిని కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు