నాణ్యతా ప్రమాణాల పెంపుతోనే గుర్తింపు

21 Jun, 2014 01:43 IST|Sakshi
నాణ్యతా ప్రమాణాల పెంపుతోనే గుర్తింపు

- బి.ముత్తురామన్ వెల్లడి
- ప్రారంభమైన 14వ ఎన్‌ఐఆర్‌కివ్ జాతీయ సదస్సు

 కొరుక్కుపేట: విద్యా, ఉత్పత్తి రంగాల్లో నాణ్యమైన ప్రమాణాలు తీసుకొచ్చినప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందని టాటా స్టీల్ వైస్ చైర్మన్ బీ.ముత్తురామన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ అండ్ రిలియబెలిటీ (ఎన్‌ఐకివ్‌ఆర్) ఆధ్వర్యంలో క్వాలిటీ - ది గ్లోబల్ విన్నింగ్  ఎడ్జ్ అనే పేరుతో శుక్రవారం నుంచి 14వ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఎన్‌ఐకివ్‌ఆర్ జాతీయ అధ్యక్షులు జీఆర్ జనార్దనన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బీ.ముత్తురామన్ హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ నాణ్యత, ఇన్నోవేషన్‌తో ఏ రంగంలోనైనా ముందుకెళ్తామన్నారు. నాణ్యతాప్రమాణాలను పెంచడంలో ఎటువంటి రాజీ పడరాదన్నారు. ప్రధానంగా ఉత్పత్తిరంగంలో పయనించే సంస్థలు నాణ్యతకు ప్రధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న  వివిధ సంస్థలు, ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్‌ఐకివ్‌ఆర్ చెన్నై బ్రాండ్ చైర్మన్ జీ.రంగరాజన్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో 220 మంది ప్రతినిధులు హాజ రు కానున్నారని అన్నారు. ఇందులో ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్, నాయకత్వ లక్షణాలు, నాణ్యతం - విశ్వసనీయత ఇంజినీరింగ్ ఇన్నోవేషన్స్, కాస్ట్ కాంపెటీటివ్‌నెస్, బెంచ్ మార్కెటింగ్ ప్రాక్టీస్, ఆర్గనైజేషన్ కల్చర్ తదితర అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు చైర్మన్ జీ.రంగరాజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు