కరోనాపై ప్రభుత్వ కమిటీల వైఫల్యం

17 May, 2020 15:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా గత మూడు వారాలుగా ప్రతి రోజు 50 వేల నుంచి 60 వేల కరోనా (కోవిడ్‌–19) కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో రోజుకు సరాసరి సగటున 1500 కేసులు నమోదవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ కరోనాను కట్టడి చేయడం కోసం పలు దేశాల్లోలాగానే భారత్‌ కూడా ఓ పక్క సామాజిక దూరం, లాక్‌డౌన్‌‌ను అమలు చేస్తూనే మరో పక్క వైద్య చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయడం, చికిత్స అందించడం, విరుగుడు లేదా వ్యాక్సిన్‌ కనుగొనేందుకు నిపుణులతోని పరీక్షలు నిర్వహించడం తదితర చర్యలు కొనసాగిస్తోంది. (బేక‌రీ ఓన‌ర్‌కు క‌రోనా: 300 మందికి ప‌రీక్ష‌లు)

ఈ అన్ని కార్యక్రమాలను సకాలంలో సమన్వయంతో కొనసాగించినప్పుడే సరైన ఫలితాలు వెలువడుతాయి. అందుకు ఉన్నత స్థాయి కమిటీలు అవసరం. అంతకన్నా కమిటీలో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు ఉండడం అవసరం. కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా కమిటీలను వేయడం భారత ప్రభుత్వానికి అలవాటే. సంక్షోభ పరిస్థితులను నిజంగా పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాకుండా సంక్షోభ పరిస్థితులను రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకోవచ్చో లేదా రాజకీయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకో కమిటీలు వేయడం మనకు పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. (క్వారంటైన్ సెంటర్లో కొట్టుకున్నారు)

కమిటీలో వేయడంలో ఎంతో ఆలస్యం
కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11వ తేదీన ‘మహమ్మారీ’గా ప్రకటించింది. భారత ప్రభుత్వం మార్చి 18వ తేదీన స్పందించింది. ఆ రోజున కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డాక్టర్‌ వీకే పాల్‌ ఆధ్వర్యంలో 21 మందితో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సలహాలు ఇచ్చేందుకు నిపుణులతో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌. ఈ కమిటీలో కొంత మంది ప్రముఖ డాక్టర్లు ఉన్నప్పటికీ మహమ్మారి, వైరస్‌లపై మంచి అవగాహన కలిగిన (ఎపిడమాలోజిస్టులు, వైరాలోజిస్టులు) లేరు. శ్వాస సంబంధిత వ్యాధులపై అవగాహన కలిగిన పల్మనాలోజిస్టులు, వీరి నిర్ణయాల అమలుకు వ్యూహాలను, ప్రణాళికలను రచించే వారు లేరు. (నీరింకిన కళ్లు..!)

మొత్తం దేశంలోని వైద్య వ్యవస్థపై అవగాహన ఉండే ‘డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌’కు కమిటీలో ప్రాతినిథ్యం లేదు. ఒక్క కేరళకు తప్పా ఏ రాష్ట్రానికి కూడా ఇందులో ప్రాతినిధ్యం లభించక పోవడం మరింత ఆశ్చర్యం. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకా, కాదా! అన్న విషయం తెలియదుగానీ ప్రధాని మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. మార్చి 29వ తేదీన కేంద్ర హోం శాఖ 79 మందితో 11 కార్యాచరణ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటిలో కూడా ఎక్కువ మంది ఐఏఎస్‌ ఆఫీసర్లను, అదీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రధాని కార్యాలయం సూచించిన వారినే తీసుకున్నారు. (వాటి ల్ల రోనా చావదు: బ్ల్యూహెచ్వో)

వైద్యం పట్ల, భారతీయ వైద్య విధానం పట్ల పూర్తి అవగాహన కలిగిన ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలోజి, ది డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్, డైరెక్టర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలోజి, ఇంటిగ్రీటెడ్‌ సర్విలెన్స్, నేషనల్‌ డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదు. (కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే)

ప్రతి కమిటీకి నిర్దిష్టమైన బాధ్యతలను నిర్దేశించక పోవడంతో కమిటీల మధ్య పారదర్శ్కత లేకపోవడమే కాకుండా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిలికి చిలికి చివరికి గాలివానలా మారిన వలస కార్మికుల సమస్య ఉన్నత స్థాయి కమిటీల వైఫల్యం, ఆ కమిటీలకు ఆ మార్గనిర్దేశకం చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యమని పైన పేర్కొన్న పలు రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  (కరోనాకుక్యూర్ఉందన్న శాస్త్రవేత్తలు)

మరిన్ని వార్తలు