నా రక్తం మరిగిపోతోంది

15 Apr, 2018 20:16 IST|Sakshi
ఆనంద్‌ మహీంద్ర

సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలు చర్చనీయాంశమైన వేళ.. నేడు సూరత్‌లో వెలుగు చూసిన మరో దాష్టీకం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. 9 ఏళ్ల చిన్నారి ఒంటిపై 86 గాయాలు.. చెప్పుకోలేని రీతిలో హింసించి.. ఆ పసికందును చెరిచి మృగవాంఛ తీర్చుకుని కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై పలువురు సోషల్‌ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

‘శిక్షించటం అనేది మంచి పద్ధతి కాదన్నది నా ఉద్దేశం. కానీ, ఇలాంటి ఘోరాలు వినప్పుడు.. చిన్న చిన్న పిల్లలపై అకృత్యాలు జరిగాయని తెలిసినప్పుడు.. సందేహం వద్దు.. ఆ దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలనే నేను కోరుకుటా. ఘటన(సూరత్‌ హత్యాచార ఘటన) గురించి తెలిసిన తర్వాత మౌనంగా ఉండటానికి ఎంతో ప్రయత్నించా. కానీ, నా దేశంలో జరుగుతున్న వరుస ఘటనలు నా రక్తం మరిగిపోయేలా చేస్తున్నాయి’ అంటూ ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. సాధారణంగా సౌమ్యుడన్న పేరున్న 62 ఏళ్ల ఈ పెద్దాయన.. భావోద్వేగంతో చేసిన ఈ ట్వీట్‌కు మద్ధతుగా పలువురు రీ-ట్వీట్లు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు