'ఫలితం ఏదైనా చివరి వరకు పోరాడు'

16 Nov, 2019 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆనంద్‌ మహీంద్ర.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఇది.. ప్రముఖ వ్యాపారవేత్త. నిత్యం వ్యాపార లావాదేవీలతో తలమునకలయ్యే ఈయన అప్పుడప్పుడు సోషల్ మీడియాపైనా ఓ కన్నేస్తుంటారు. ఈయనకు సినీ హీరోల రేంజ్‌లో సోషల్‌మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. ఆయన ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటలో అయినా జీవితంలో అయినా ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఈ వీడియో ఓ కబడ్డీ మ్యాచ్‌కు సంబంధించినది.

కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్‌ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర.. ప్రొకబడ్డీ లీగ్‌లో ఇలాంటి సీన్ చూడలేదంటూ కామెంట్ చేశారు. ఏదైనా చివరి వరకు పోరాడు అనే సందేశాన్ని ఇచ్చారు మహీంద్ర. పాయింట్ వచ్చేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోగా, ప్రత్యర్థికి ఓ పాయింట్ కోల్పోయిన స్థితిలో కూడా పోరాటపటిమ ఉంటే ఎలాంటి ఫలితమైనా వస్తుందని సదరు ఆటగాడు నిరూపించాడు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా